న్యూఢిల్లీ, జూన్ 26: దేశవ్యాప్తంగా 345 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలను (ఆర్యూపీపీలు) డీలిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది.
2019 నుంచి ఇప్పటివరకు గత ఆరేండ్లలో ఒక్క ఎన్నికలోనూ పోటీచేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ తెలిపింది. ప్రస్తుతం 2,800 ఆర్యూపీపీలు ఎన్నికల సంఘం వద్ద నమోదై ఉన్నాయన్నారు.