Election Commission | వీవీ ప్యాట్లపై జైరామ్ రమేశ్ అనుమానం.. తోసిపుచ్చిన ఎన్నికల సంఘం
Election Commission | వీవీప్యాట్లపై (VVPAT) కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ వ్యక్తం చేసిన ఆందోళనను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. జైరామ్ రమేశ్ లేవనెత్తిన అనుమానాల్లో మరింత స్పష్టత ఇవ్వాల్సిన అంశాలేవీ లేవని పేర్కొంది. వీవీప్యాట్ స్లిప్‌లను 2013లో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని గుర్తుచేసింది.
న్యూఢిల్లీ: వీవీప్యాట్లపై (VVPAT) కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ వ్యక్తం చేసిన ఆందోళనను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. జైరామ్ రమేశ్ లేవనెత్తిన అనుమానాల్లో మరింత స్పష్టత ఇవ్వాల్సిన అంశాలేవీ లేవని పేర్కొంది. వీవీప్యాట్ స్లిప్‌లను 2013లో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని గుర్తుచేసింది. ఈవీఎంల (EVM) వినియోగంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్‌కు ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ శర్మ లేఖ రాశారు.
ఎన్నికల నిర్వహణ నియమావళి 1961లోని 49ఎ, 49ఎం నిబంధనల కింద వీవీప్యాట్లను ఆగస్టు 14, 2013లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని అందులో పేర్కొన్నారు. ఈవీఎంల వినియోగంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేలా అందుబాటులో ఉంచిన FAQs స్పష్టతనిస్తాయని తెలిపారు. అయితే, ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలున్నాయని విపక్ష కూటమి ‘ఇండియా’ ఆరోపిస్తున్నది. వీవీప్యాట్ స్లిప్‌లను ఓటర్లకు అందించాలని, ఆ తర్వాత వాటిని 100 శాతం లెక్కించాలని డిమాండ్ చేస్తున్నది.
న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన కూటమి సమావేశంలోనూ ఇదే అంశంపై ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ అంశాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం ఇండియా కూటమి బృందానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ కేంద్ర ఎన్నికల సంఘానికి డిసెంబర్ 30న లేఖ రాశారు. అందుకు ఈసీ ఇవాళ బదులిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

