న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. పోలింగ్, కౌంటింగ్ జరిగే రోజుల్లో ఇలాంటి నిరాధార, సంచలన ఫిర్యాదులు లేవనెత్తడం ప్రజా అస్థిరతకు, అనవసర సంక్షోభానికి కారణం అవుతుందని, సామాజిక వ్యవస్థకు భంగం కలగొచ్చని ఈసీ పేర్కొన్నది.
ఇలాంటి ఫిర్యాదులు మానుకోవాలని కాంగ్రెస్తో పాటు ఇతర రాజకీయ పార్టీలను కోరింది. ‘ఇటీవల ముగిసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియపై కాంగ్రెస్ లేవనెత్తిన నిరాధార ఆరోపణలను తిరస్కరిస్తున్నాం’ అని ఈసీ మంగళవారం అధికారిక ప్రకటనలో పేర్కొన్నది.