చెన్నై : సంక్రాంతికి విడుదలైన విజయ్ వారసుడు మూవీ పాజిటివ్ టాక్‌తో మెరుగైన కలెక్షన్లు రాబడుతోంది. వంశీ పైడిపల్లి నిర్ధేశకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ సరసన కన్నడ భామ రష్మిక మందన సందడి చేశారు. ఈ సినిమాలో పాటలు ముఖ్యంగా రంజితమే సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను ధియేటర్లో చూస్తూ రంజితమే సాంగ్‌కు ఏకంగా స్క్రీన్ వద్ద ఓ పెద్దావిడ స్టెప్పులతో హోరెత్తించారు.
No salsa no flamingo my brother do u know grandma kuthu🔥🔥🔥 …….this grandma lit the fire on theatre for ranjithame song pic.twitter.com/sqkytZcJnm
— Nizamudeen (@zamnsk) January 15, 2023
వారసుడు మూవీలో రంజితమే సాంగ్‌కు థియేటర్లో హుషారైన స్టెప్పులతో అలరించిన మహిళ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ పాట ప్లే అవుతుండగా బామ్మతో పాటు పలువురు తమ సీట్లలో నుంచి లేచి క్రేజీ స్టెప్స్‌తో థియేటర్లో హంగామా సృష్టించారు. రంజితమే సాంగ్‌కు ఈ బామ్మ థియేటర్‌ను తన డ్యాన్స్‌తో హోరెత్తించారని వీడియోను షేర్ చేస్తూ ట్విట్టర్ యూజర్ నిజాముద్దీన్ రాసుకొచ్చారు.
పెద్దావిడ హుషారైన మూమెంట్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. విజయ్‌కు పండగ పూట భారీ గిఫ్ట్ ఇదేనని, ఆయనను ఆరు నుంచి అరవై ఏండ్ల వయసు వరకూ అందరూ ఆరాధిస్తారని ఓ యూజర్ రాసుకొచ్చారు. వారసుడు మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించగా తమిళ వెర్షన్ వారిసు జనవరి 11న విడుదలవగా వారసుడు తెలుగు వెర్షన్ ఈ నెల 14న విడుదలైంది.