న్యూఢిల్లీ : ఇంటర్నెట్లో ఆలోచన రేకెత్తించే వీడియోలు, వినోదం పంచే వీడియోలు ఎన్నో కనిపిస్తుంటాయి. వీటితో పాటు హృదయాన్ని తాకే కొన్ని వీడియోలు అయితే నెటిజన్లను కంటతడి పెట్టిస్తాయి. మరణించిన తన భార్య కోసం ఓ పెద్దాయన ఎంతటి ప్రేమను కనబరుస్తాడో తెలిపే వీడియో (viral video) నెట్టింట తెగ వైరలవుతోంది.
ఈ వీడియోను గుర్పీందర్ సంధు అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ ఏకంగా 20 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోలో సైకిల్ మీద తన దివంగత భార్య ఫొటోతో రోడ్డు పక్కన స్టాల్లో షర్బత్‌ను తీసుకుంటున్న వృద్ధుడు కనిపిస్తాడు. షర్బత్‌ను సేవించే ముందు ఆయన తన భార్య ఫోటో ముందు గ్లాస్‌ను ఉంచి ఆమె వైపు చూపించిన అనంతరం తాను తీసుకుంటాడు.
పెద్దాయన దివంగత భార్య పట్ల కనబరిచిన ప్రేమకు నెటిజన్లు కదిలిపోయారు. తాను ఈరోజు చూసిన బెస్ట్ వీడియో ఇదేనని ఓ యూజర్ కామెంట్ చేయగా, నిజమైన ప్రేమ ఏదని ఎవరైనా అడిగితే తాను ఈ బ్యూటిఫుల్ క్లిప్‌ను చూపుతానని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More