న్యూఢిల్లీ: మెట్రో రైలులో ప్రయాణించిన ఒక వృద్ధుడు బీడీ స్మోక్ చేశాడు. (Elderly Man Smoke Bidi In Delhi Metro) దీనిపై ఒక వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఒక వృద్ధుడు ఢిల్లీ మెట్రో ట్రైన్లో ప్రయాణించాడు. డోర్ పక్కగా ఉన్న సీటు వద్ద కూర్చొన్న అతడు తాపీగా బీడీ వెలిగించాడు. అనంతరం మండుతున్న అగ్గిపుల్లను మెట్రో రైలు ఫ్లోర్‌పై పడేశాడు. ఇది చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు. ఒక వ్యక్తి ఆ వృద్ధుడ్ని నిలదీశాడు. మెట్రో రైలులో బీడీ కాల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు.
కాగా, ఆ మెట్రో రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డ్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై స్పందించారు. ఢిల్లీ మెట్రో అధికారుల దృష్టికి దీనిని తీసుకెళ్లారు. మెట్రో రైలులో బీడీ స్మోక్ చేసిన ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. అయితే ఢిల్లీ మెట్రో రైలు అధికారులు ఇంకా దీనిపై స్పందించలేదు.
दिल्ली मेट्रो में खुल्लम खुल्ला किसिंग के बीच अब… बीड़ी का स्वैग#DelhiMetro pic.twitter.com/HDJk1rzl8b
— Manish Pandey (@joinmanishpande) September 25, 2023