తిరువనంతపురం : కేరళలోని త్రిసూర్ జిల్లాలో మొబైల్ ఫోన్ పేలిన ఘటన నుంచి 70 ఏండ్ల వృద్ధుడు త్రుటిలో తప్పించుకున్నాడు. (viral video) తన షర్ట్ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ పేలి మంటలు రాగా, వేగంగా స్పందించడంతో ఎలాంటి గాయాలు కాకుండా ఆయన బయటపడ్డారు. మరోటికల్ ప్రాంతంలోని ఓ టీ స్టాల్లో ఇలియాస్ గురువారం ఉదయం టీ తాగుతుండగా తన షర్ట్ జేబులోని మొబైల్ నుంచి మంటలు చెలరేగాయి.
వృద్ధుడు వెంటనే లేచి టీ గ్లాస్‌ను కింద పడేసి ఆపై మొబైల్ ఫోన్‌ను జేబు నుంచి బయటకు తీసి నేలపైకి విసిరేశాడు. అప్పటికే అతని షర్టుకు మంటలంటుకున్నాయి. చేతులతో వాటిని ఆర్పాడు. దీంతో వృద్ధునికి పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. పలు టీవీ చానెళ్లలో ప్రసారం కావడంతో ఒల్లూర్ పోలీస్ స్టేషన్ అధికారి వృద్ధుడిని కలిసి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తాను ఈ ఫోన్‌ను ఏడాది కిందట రూ. 1000కి కొనుగోలు చేశానని, ఇప్పటి వరకూ ఫోన్‌తో ఎలాంటి సమస్యలు రాలేదని వృద్ధుడు చెప్పుకొచ్చారు. ఇక గత వారం ప్యాంటు జేబులో ఉన్న మొబైల్ ఫోన్ పేలడంతో కోజికోడ్‌లోని ఓ వ్యక్తికి కాలిన గాయాలయ్యాయి. ఇక ఏప్రిల్ 24న త్రిసూర్‌కు చెందిన ఎనిమిదేండ్ల బాలిక చార్జింగ్‌లో ఉన్న మొబైల్ ఫోన్‌ను వాడుతుండగా ఫోన్ పేలడంతో మరణించింది.
Read More