పుణె, ఏప్రిల్ 5: ఆడబిడ్డ అని తెలిస్తే పురిట్లోనే చిదిమేస్తున్న ఘటనలు విన్నాం. చెత్త కుప్పల్లో పడేస్తున్న దారుణాలు చూశాం. కానీ మహారాష్ట్రలోని ఓ కుటుంబం మాత్రం తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందని భావించి, తల్లీ బిడ్డను హెలికాప్టర్లో ఇంటికి తీసుకొచ్చింది. పుణె జిల్లాలో ఈ ఘటన జరిగింది. హెల్గావ్ గ్రామానికి చెందిన విశాల్ జరేకర్ భార్య జనవరిలో తన పుట్టింటిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విశాల్ కుటుంబం ఈ నెల 2న ఒక హెలికాప్టర్ ఏర్పాటు చేసి, వారిద్దరిని ఇంటికి తీసుకొచ్చింది.