న్యూఢిల్లీ : ఇజ్రాయెల్-హమస్ ఉగ్రవాద సంస్థ పరస్పర దాడులతో గాజా స్ట్రిప్‌లో అష్టకష్టాలు అనుభవిస్తున్నవారికి కాస్త శుభవార్త అందింది. వీరికి అత్యవసర సాయాన్ని అందజేయడం కోసం ఈజిప్ట్-గాజా స్ట్రిప్ సరిహద్దులను శనివారం తెరిచారు. హమస్ ఉగ్రవాదులు రెండు వారాల క్రితం ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తర్వాత ఈ సరిహద్దులను తెరవడం ఇదే తొలిసారి. గాజాలో మునుపెన్నడూ లేనంత తీవ్రంగా మానతావాద సంక్షోభం నెలకొందని, అయినప్పటికీ కేవలం 20 లారీలను మాత్రమే అనుమతించారని, ఈ సహాయం ఎంత మాత్రం సరిపోదని సహాయక బృందాలు తెలిపాయి.