Dussehra Event | సనాతన ధర్మ విమర్శకుల దిష్టిబొమ్మల తొలగింపు
దసరా వేడుకలకు (Dussehra Event) ముందు ఢిల్లీలోని ఐకానిక్ ఎర్రకోట మైదానం వద్ద అంతకుముందు కనిపించిన సనాతన ధర్మ విమర్శకుల దిష్టిబొమ్మలను తొలగించారు.
న్యూఢిల్లీ : దసరా వేడుకలకు (Dussehra Event) ముందు ఢిల్లీలోని ఐకానిక్ ఎర్రకోట మైదానం వద్ద అంతకుముందు కనిపించిన సనాతన ధర్మ విమర్శకుల దిష్టిబొమ్మలను తొలగించారు. దసరా వేడుకలు ప్రారంభం కాకముందు రావణ దహనం సందర్భంగా ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మలపై సనాతన ధర్మ వ్యతిరేకుల లేబుల్స్‌ను అధికారులు తొలగించారు.
దిష్టిబొమ్మల్లో ఒకదానిపై సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వారిని నాశనం చేస్తామని రాసి ఉండగా ఇప్పుడు అలాంటి దిష్టిబొమ్మలను తొలగించారు.ఇక సనాతన ధర్మ విమర్శకుడని రాసిఉన్న మరో దిష్టిబొమ్మను కూడా తొలగించారు. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపడంతో దేశవ్యాప్తంగా చర్చకు తెరలేచిన సంగతి తెలిసిందే.కాగా రావణ దహనం కార్యక్రమంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎల్జీ వీకే సక్సేనా సహా పలువురు ప్రముఖులు ముఖ్యఅతిధులుగా హాజరవుతున్నారు.
సనాతన ధర్మాన్ని ఆయన డెంగ్యూ, మలేరియా వైరస్‌లతో పోల్చడం కలకలం రేపింది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు దాన్ని సమూలంగా నిర్మూలించాలని స్టాలిన్ వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం, సమానత్వానికి సనాతన ధర్మం వ్యతిరేకమని పేర్కొన్నారు. ఉదయనిధి వ్యాఖ్యలు దేశాన్ని అవమానించేలా ఉన్నాయని, దేశంలో మత సామరస్యానికి ముప్పు వాటిల్లేలా ఉన్నాయని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
Read More :
Constipation | ఈ డ్రింక్స్‌తో మలబద్ధకానికి చెక్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

