మనీలా, ఆగస్టు 31 : మారుమూల గ్రామాల్లో బడి బయట ఉన్న బాలికలకు విద్యను అందించే భారతీయ ఎన్జీవో ‘ఎడ్యుకేట్ గర్ల్స్’కు ఆసియా నోబెల్ ‘రామన్ మెగసెసె’ అవార్డు వరించింది. 2025 ఏడాదికిగాను అవార్డు గ్రహీతల పేర్లను ఫౌండేషన్ (ఆర్ఎంఏఎఫ్) ఆదివారం విడుదల చేసింది.
పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయ ఎన్జీవోగా ఈ సంస్థ నిలిచింది. నవంబర్ 7న మనీలాలో 67వ రామన్ మెగసెసె అవార్డుల బహూకరణ ఉంటుందని ఆర్ఎంఏఎఫ్ తెలిపింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనానమిక్స్ గ్రాడ్యుయేట్ సఫీనా హుస్సేన్, మహిళల్లో నిరక్షరాస్యతను రూపుమాపడానికి, 2007లో ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ను స్థాపించారు.