CM Ashok Gehlot | విదేశీ మారకద్రవ్యం కేసు.. రాజస్థాన్ సీఎం గెహ్లాట్ కుమారునికి ఈడీ నోటీసులు
ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) కింద ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) కుమారుడు వైభవ్ గెహ్లాట్‌కు (Vaibhav Gehlot) నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న (శుక్రవారం) జైపూర్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ అందులో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు రాజస్థాన్ (Rajasthan) అధికార పార్టీ కాంగ్రెస్‌కు (Congress) కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుసగా షాక్ ఇస్తున్నాయి. గురువారం ఉదయం టీచర్ రిక్రూట్మెంట్ పేపర్ లీకేజీ కేసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు.. ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) కింద ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) కుమారుడు వైభవ్ గెహ్లాట్‌కు (Vaibhav Gehlot) నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న (శుక్రవారం) జైపూర్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ అందులో పేర్కొన్నారు.
ఫెమా నిబంధనలు అతిక్రమించి మనీ లాండరింగ్‌కు పాల్పడినందుకు గాను ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ట్రైటన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రవేట్ లిమిటెడ్‌పై ఈడీ కేసు నమోదుచేసింది. ఇదే వ్యవహారంలో జైపూర్, ఉదయ్‌పూర్, ముంబై, ఢిల్లీలో అధికారులు గత ఆగస్టులో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ రతన్‌కాంత్ శర్మను సీఎం గెహ్లాట్ కుమారుడు వైభవ్ వ్యాపార భాగస్వామిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం వైభవ్‌కు సమన్లు జారీచేశారు.
కాగా, 2022, డిసెంబర్లో జరిగిన ప్రభుత్వ స్కూల్ టీచర్ల రిక్రూట్మెంట్ పరీక్షా పేపర్ల లీకేజీ కేసుతో సంబంధమున్న వారి ఇండ్లలో గురువారం ఉదయం ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతసారా (Govind Singh Dotasra) ఇంట్లో కూడా సోదాలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుండగా ఈ దాడులు జరగడం సర్వత్రా చర్చకు దారితీశాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

