న్యూయార్క్ : ప్రముఖ గాయకుడు, పాటల రచయిత ఈద్ షిరన్ లేటెస్ట్ వీడియో (viral video) సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో మ్యాక్సిన్ అనే పేరుగల కుక్క పిల్లను షేప్ ఆఫ్ యూ సింగర్ బ్యాక్‌ప్యాక్‌లో తన వెంట తీసుకువెళ్లడం కనిపిస్తుంది. కుక్కపిల్లకు డెడికేట్ చేసిన ఇన్స్టాగ్రాం పేజ్‌లో ఈద్ షిరన్ ఈ వీడియోను షేర్ చేశారు.
న్యూయార్క్‌లో ఉండే ఈ సింగర్ బ్యాక్ ప్యాక్‌లో కుక్కపిల్లను తన వెంట తీసుకువెళ్లడం నెటిజన్లను ఆకట్టుకుంది. కెమెరా వైపు చూస్తూ ఇది అద్భుతమని ఈద్ షిరన్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఈ వీడియోకు నెటిజన్లు కామెంట్స్ సెక్షన్లో పలు రకాలుగా రియాక్టయ్యారు.
ఫ్యాన్స్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు మ్యాక్సిన్ టైమ్ ఇవ్వడం సంతోషకరమని ఓ యూజర్ కామెంట్ చేయగా నిజమైన సెలబ్రిటీ ఎవరో మీరు చూడొచ్చని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More