టార్గెట్ ఐప్యాక్.. బెంగాల్ ఎన్నికల వేళ ఐప్యాక్ కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు
మరికొద్ది రోజుల్లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న వేళ.. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ కార్యాలయాల్లో గురువారం ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా తదితర నగరాల్లోని ఐప్యాక్ ఆఫీసుల్లో ఈ తనిఖీలు జరిగాయి. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ సింగ్ నివాసంలోనూ ఈ తనిఖీలు జరిగినట్టు సమాచారం.
- హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ కోల్‌కతా నగరాల్లో సోదాలు
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : మరికొద్ది రోజుల్లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న వేళ.. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ కార్యాలయాల్లో గురువారం ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా తదితర నగరాల్లోని ఐప్యాక్ ఆఫీసుల్లో ఈ తనిఖీలు జరిగాయి. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ సింగ్ నివాసంలోనూ ఈ తనిఖీలు జరిగినట్టు సమాచారం. బొగ్గు స్మగ్లింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ సోదాలు నిర్వహించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అప్పుడు ఆకుపచ్చ ఫైలుతో మమత
బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కు ఎన్నికల వ్యూహరచన చేస్తున్న ఐప్యాక్ కార్యాలయాలపై జనవరిలోనూ ఈడీ దాడులు నిర్వహించింది. సెంట్రల్ కోల్‌కతాలోని లౌడన్ స్ట్రీట్‌లో ఉన్న ఐప్యాక్ అధిపతి ప్రతీక్ జైన్ నివాసం, కార్యాలయంతోపాటు సాల్ట్ లేక్‌లోని ఐప్యాక్ మరో కార్యాలయంలోనూ ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. అయితే, ఈ సోదాలు కొనసాగుతున్న సమయంలో అక్కడకు చేరుకొన్న సీఎం మమతా బెనర్జీ జైన్ నివాసం లోపలికి చొచ్చుకొని వెళ్లారు. అనంతరం కొంత సమయం తర్వాత ఆకుపచ్చ రంగు ఫైలు పట్టుకుని బయటకు వచ్చారు. అనంతరం అక్కడే ఉన్న మీడియాతో మమత మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ఈడీ దాడులు రాజకీయ ప్రోద్బలంతో జరిగినవని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ దాడుల వెనుక ఉన్నారని, టీఎంసీ ఎన్నికల వ్యూహాన్ని, 2026 ఎన్నికల అభ్యర్థుల జాబితాలను, పార్టీకి చెందిన రహస్య పత్రాలను కాజేసేందుకే ఈ దాడులకు ఆదేశించారని మమత ఆరోపించారు. టీఎంసీ ఎన్నికల వ్యూహానికి సంబంధించిన ఫైళ్లను చోరీ చేశారని ఈడీని నిందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

