Pinarayi Vijayan: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు
Pinarayi Vijayan: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో ఇవాళ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. తిరువనంతపురంలోని ఆయన ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. మనీల్యాండరింగ్ కేసులో మొత్తం 12 ప్రదేశాల్లో ఆ సోదాలు జరుగుతున్నాయి.
న్యూఢిల్లీ: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్(Pinarayi Vijayan) నివాసంలో ఇవాళ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. తిరువనంతపురంలోని ఆయన ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. మనీల్యాండరింగ్ కేసులో మొత్తం 12 ప్రదేశాల్లో ఆ సోదాలు జరుగుతున్నాయి. కన్నూరులోని విజయన్ నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నట్లు తెలిసింది. కొచ్చిన మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ సంస్థ విజయన్ కుమార్తె టీ వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అనే కంపెనీకి సుమారు 1.72 కోట్ల అక్రమ పేమెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018 నుంచి 2019 మధ్య ఆ లావాదేవీలు జరిగాయి.
ఎక్సాలాజిక్ సంస్థ ఎటువంటి సేవలు అందించకున్నా.. ఆ సంస్థకు డబ్బులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విజయన్ కుమార్తె వీణను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. వీణ భర్త ఎమ్మెల్యే మొహమ్మద్ రియాస్ ఇంట్లో కూడా ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిధరన్ కర్త కుమారుడు శరణ్ కర్త ఇంట్లో కూడా ఈడీ తనిఖీ చేస్తున్నది. ఈడీ సోదాలు అడ్డుకోవాలని సీఎంఆర్ఎల్ సంస్థ కోర్టను ఆశ్రయించింది. అయితే ఆ పిటీషన్ను మంగళవారం కేరళ హైకోర్టు డిస్మిస్ చేసింది. పీఎంఎల్ఏ కేసును ఈడీ నమోదు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

