న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు నటీనటులను విచారించిన ఈడీ..తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాతోపాటు, బెంగాల్ నటి, టీఎంసీ మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి నోటీసులు జారీ చేసింది.
మిమి చక్రవర్తిని ఈనెల 15న, ఊర్వశిని ఈ నెల 16న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వీరిద్దరూ ప్రముఖ బెట్టింగ్ యాప్‌నకు ప్రచారం చేసినట్టు తెలిసింది. ఆర్థిక లావాదేవీలు, ప్రచారంలో వీరిద్దరి పాత్ర ఎంత మేరకు అన్నది తెలుసుకునేందుకు విచారణ అవసరమని ఈడీ భావిస్తున్నది.