బెంగళూరు : కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో పాటు పలువురిపై మనీలాండింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చార్జిషీట్ దాఖలు చేసింది. ఐటీశాఖ సోదాల ఆధారంగా ఈడీ నమోదు చేసిన మనీలాండింగ్ కేసులో శివకుమార్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద 2019లో కాంగ్రెస్ సీనియర్ నేతను ఈడీ అరెస్టు చేశారు. పన్నుల ఎగవేత, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆధారంగా 2018 సెప్టెంబర్‌లో ఈడీ శివకుమార్‌తో పాటు ఆయన సన్నిహితులపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.