మైసూర్, అక్టోబర్ 19: ముడా భూమి కుంభకోణానికి సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నది. ఈ క్రమంలో ఈడీ అధికారులు మైసూర్‌లోని ముడా కార్యాలయంలో రెండో రోజైన శనివారం తనిఖీలు కొనసాగించారు.
ముడా కమిషనర్ ఏఎన్ రఘునందన్, కార్యదర్శి ప్రసన్న వీకే, ఇతర అధికారులను ఈడీ ప్రశ్నించింది. 40 మంది సీఆర్పీఎఫ్ దళాలు, నగర పోలీసులతో శుక్రవారం ముడా కార్యాలయంలో రాత్రి 11.30 గంటల వరకు ఈడీ తనిఖీలు చేపట్టింది. వాటిని శనివారం కూడా కొనసాగించింది.