కోల్‌కతా : రేషన్ పంపిణీకి సంబంధించిన కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్‌ను శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. 18 గంటల విచారణ అనంతరం మంత్రిని శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది.
ప్రస్తుతం అటవీ మంత్రిగా ఉన్న జ్యోతిప్రియో ఆహార, సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ కుంభకోణం జరిగిందని ఆరోపించిన ఈడీ.. మంత్రిని తమ కస్టడీకి ఇవ్వాలని తాజాగా న్యాయస్థానాన్ని కోరింది. ‘పెద్ద కుట్రలో తాను బాధితుడినని’ మంత్రి ఈ సందర్భంగా వాపోయారు. బీజేపీ నేత సువేందు అధికారి తనను ఇందులో ఇరికించారని ఆరోపించారు. కాగా, మంత్రి అరెస్ట్‌ను అధికార టీఎంసీ తీవ్రంగా ఖండించింది.