న్యూఢిల్లీ, జూలై 18: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్‌ని రూ.2,100 కోట్ల లిక్కర్ కుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం అరెస్టు చేసింది. భిలాయ్‌లోని నివాసం నుంచి చైతన్య బఘేల్‌ని కస్టడీలోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భిలాయ్‌లోని బఘేల్ కుటుంబ నివాసం వెలుపల భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది మోహరించారు.
తన కుమారుడు చైతన్యను అతని పుట్టినరోజు నాడే అరెస్టు చేశారని భూపేశ్ బఘేల్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఇచ్చినట్లుగా ఎవరూ ఈ రకమైన జన్మదిన బహుమతి ఇవ్వరని అన్నారు. తన పుట్టిన రోజున ఆ ఇద్దరు బీజేపీ నాయకులు తన సలహాదారు, ఇద్దరు ఓఎస్డీల ఇళ్లకు ఈడీ అధికారులను పంపించారని ఆయన గుర్తు చేశారు.