న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఐక్యరాజ్యసమితి (ఐరాస) అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘చాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్’కు భారత్‌కు చెందిన ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధ వ్ గాడ్గిల్ (82) ఎంపికయ్యారు. 2024 ఏడాదికి సంబంధించి అవార్డ్ గ్రహీతల జాబితాను ఐరాస మంగళవారం విడుదల చేసింది.
ప్రపంచంలోనే అత్యంత జీవ వైవిధ్యాన్ని కలిగిన పశ్చిమ కనుమల్లో పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ పురస్కారానికి ఐరాస ఎంపికచేసింది. ఈ ఏడాది అవార్డు గ్రహీతల్లో భారత్ నుంచి మాధవ్ గాడ్గిల్ ఒక్కరికే చోటు దక్కింది. గతంలో కేంద్రం ఏర్పాటుచేసిన ప్యానెల్‌కు మాధవ్ గాడ్గిల్ నేతృత్వం వహించారు. పురస్కారానికి ఎంపిక కావటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.