న్యూఢిల్లీ, ఆగస్టు 21 : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అధికారిక పర్యటనలు, ప్రజాధనంతో వాటికి అయిన ఖర్చుల వివరాలను వ్యక్తిగత సమాచారం అని పేర్కొంటూ సమాచార హక్కు చట్టం కింద వెల్లడించడానికి ఎన్నికల కమిషన్ నిరాకరించిందని రాజ్యసభ మాజీ సభ్యుడు సాకేత్ గోఖలే శుక్రవారం ఆరోపించారు.
2025 ఫిబ్రవరి 19న సీఈసీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జ్ఞానేశ్ కుమార్ పర్యటనలు, ఇతర వాటికి ప్రభుత్వ నిధుల నుంచి అయిన ఖర్చుపై జూన్ 18న ఆర్టీఐ దరఖాస్తు చేసినట్టు గోఖలే తెలిపారు. జూలై 31న ఇచ్చిన సమాధానంలో ఆయన వ్యక్తిగత వివరాలను వెల్లడించలేమని అన్నారు. ప్రజాధ నంతో చేసిన ఖర్చును వ్యక్తిగత సమాచారం అని ఎలా అనగలరని, ప్రధాని ఖర్చును కూడా పార్లమెంట్లో వెల్లడించారని, జ్ఞానేష్ కుమార్ విషయంలో మాత్రం ప్రత్యేకత ఏందని ఆయన నిలదీశారు.