రెచ్చగొట్టే ప్రసంగాలేల?
లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలలో అటు అధికారంలోని బీజేపీ, ఇటు విపక్ష కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రసంగాలను ఎన్నికల కమిషన్ తప్పుబట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీలు సహా ఆయా పార్టీలు స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల సభలలో చేస్తున్న ప్రసంగాలపై అభ్యంతరం తెలుపుతూ ఇకనైనా వాటిని సరిదిద్దుకోవాలని హెచ్చరించింది.
- బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార తీరుపై ఈసీ ఫైర్
న్యూఢిల్లీ, మే 22: లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలలో అటు అధికారంలోని బీజేపీ, ఇటు విపక్ష కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రసంగాలను ఎన్నికల కమిషన్ తప్పుబట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీలు సహా ఆయా పార్టీలు స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల సభలలో చేస్తున్న ప్రసంగాలపై అభ్యంతరం తెలుపుతూ ఇకనైనా వాటిని సరిదిద్దుకోవాలని హెచ్చరించింది. ఉద్రిక్తతలను పెంచే ప్రసంగాలను దూరం పెట్టాలని, ప్రచారంలో సంయమనాన్ని పాటించాలని కోరింది. దేశంలోని రెండు ప్రధాన పార్టీలు కులం, మతం, భాష, ప్రాంతీయత్వం, రాజ్యాంగం వంటివి ప్రధాన అంశాలుగా చేసుకుని ప్రచారం చేస్తున్నాయని గుర్తు చేసింది.
కుల, మతాల మధ్య విభజనకు దారితీసే అంశాలు, రాజ్యాంగం రద్దు లాంటి అంశాలను ఈ ప్రధాన పార్టీలు తమ ప్రచారంలో ప్రధానంగా ఉంచడాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది. ఇలాంటి అంశాలపై ప్రచారం సాగిస్తూ ఆయా వర్గాలలో ఉద్రిక్తతలు పెంచవద్దని కోరింది. ఈ విషయంలో పార్టీ అధ్యక్షులు తమ స్టార్ క్యాంపెయినర్లను రెచ్చగొట్టే ప్రసంగాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేలను ఎన్నికల సంఘం ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

