Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం.. 24 గంటల్లో మూడోసారి
వరుస భూకంపాలతో (Earthquake) అండమాన్ నికోబార్ దీవులు (Andaman-Nicobar Islands) వణికిపోతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి క్రమంతప్పకుండా భూ ప్రకంపణలు చోటుచేసుకుంటున్నాయి.
పోర్ట్‌బ్లెయిర్: వరుస భూకంపాలతో (Earthquake) అండమాన్ నికోబార్ దీవులు (Andaman-Nicobar Islands) వణికిపోతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి క్రమంతప్పకుండా భూ ప్రకంపణలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూకంప కేంద్రం క్యాంప్‌బెల్ తీరానికి (Campbell Bay) 220 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 32 కిలోమీటర్ల లోతున ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. దీనివల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
కాగా, ఆదివారం మధ్యాహ్నం నుంచి అండమాన్ దీవుల్లో భూకంపం రావడం ఇది మూడోసారిది. ఆదివారం మధ్యాహ్నం 2.59 గంటలకు మొదటిసారిగా భూమి కంపించిందని, దీని తీవ్రత 4.1గా నమోదయిందని ఎన్సీఎస్ తెలిపింది. అనంతరం గంటల వ్యవధిలోనే మరోసారి 5.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిందని చెప్పింది. 10 కి.మీ లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లుగా వెల్లడించింది. ఈనెల 6న కూడా దీవుల్లో భూకంపం సంభవించింది. గత గురువారం రాత్రి 10.47 గంటలకు 5.3 తీవ్రతతో పోర్ట్ బ్లెయిర్‌కు 140 కి.మీ దూరంలో భూమి కంపించింది. దీనివల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

