కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ హాస్పిటల్లో మరో దారుణం జరిగింది. నైట్ షిఫ్ట్‌లో ఉన్న నర్సును ఒక రోగి లైంగికంగా వేధించాడు. (Nurse Molested By Patient) దీంతో బాధితురాలు హాస్పిటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడైన రోగిని అరెస్ట్ చేశారు. బీర్భూమ్లోని ఇలంబజార్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి అబ్బాస్ ఉద్దీన్ జ్వరంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. నైట్ షిఫ్ట్‌లో ఉన్న నర్సు, డాక్టర్ సూచనల మేరకు ఆ రోగికి సెలైన్ పెట్టింది. ఈ సందర్భంగా ఆ వ్యక్తి నర్సును అనుచితంగా తాకాడు. నిలదీసిన ఆమెతో అసభ్యకరంగా మాట్లాడాడు. అతడి కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆ నర్సు పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
కాగా, ఈ సంఘటనపై బాధిత నర్సు ఆవేదన వ్యక్తం చేసింది. సెక్యూరిటీ లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వాపోయింది. కుటుంబ సభ్యుల సమక్షంలో డ్యూటీలో ఉన్న నర్సు పట్ల ఆ వ్యక్తి అలాంటి పని చేయడానికి ఎలా ధైర్యం చేస్తాడు? అని ప్రశ్నించింది. అతడ్ని నిలువరించేందుకు కుటుంబ సభ్యులు కూడా ఏమీ చేయలేదని ఆమె ఆరోపించింది.
మరోవైపు ఈ సంఘటనపై హాస్పిటల్ యాజమాన్యానికి ఆ నర్సు ఫిర్యాదు చేసింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. నిందితుడైన రోగి అబ్బాస్ ఉద్దీన్‌ను అరెస్ట్ చేశారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దారుణ హత్యాచార సంఘటన మరువక ముందే ఈ సంఘటన జరుగడం బెంగాల్లో కలకలం రేపింది.
In West Bengal, the first day of September, 2024 starts with four reported cases of sexual assault:
1. Nurse molested in llambazar Swasthya Kendra in Birbhum. A man named Sheikh Abbasuddin forcefully groped her private parts, while she was on night duty. Mamata Banerjee, instead… pic.twitter.com/7SB6bkxdtl
— Amit Malviya (@amitmalviya) September 1, 2024