Barabanki | ఉత్తరప్రదేశ్ బారాబంకిలో భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక డంపర్ ట్రక్ వంతెన రెయిలింగ్‌ను ఢీకొట్టి ఆ తర్వాత రైల్వే ట్రాక్‌లపై పడిపోయింది. పక్కనే మరో మార్గంలో అమృత్సర్-బిహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ తృటిలో వెళ్తున్నది. రైలుకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో భారీ పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వాహనంలో చిక్కుకుపోయిన డంపర్ డ్రైవర్‌ను రెస్క్యూ ఆపరేషన్ ద్వారా బయటకు తీశారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బారాబంకి పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అర్పిత్ విజయవర్గియా మాట్లాడుతూ.. డ్రైవర్ డంపర్‌లో లోపల చిక్కుకుపోయాడని తెలిపారు. పోలీసులు, రైల్వే అధికారులు, ఇతర విభాగాల సహాయంతో అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ట్రాక్‌పై డంపర్ పడిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. ప్రమాదం తర్వాత ప్రాసింజర్ రైలు ఈ మార్గంలోనే చిక్కుకుపోయిందని.. దాన్ని తరలించేందుకు ప్రత్యామ్నాయ ఇంజిన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైలు సురక్షితంగా ఉందని.. ట్రక్కు సమీపంలోని లైన్‌పై పడిపోయిందన్నారు. ట్రాక్‌ను తనిఖీ చేసిన తర్వాత రైలు రాకపోకలు పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.