IndiGo | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండోర్‌కు మళ్లిన ఇండిగో విమానం
IndiGo | విమానం గాలిలో ఎగురుతుండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఇండిగో పైలట్లు సానుకూలంగా స్పందించారు. ప్రయాణికుడికి మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆ విమానాన్ని ఇండోర్‌కు మళ్లించారు.
భోపాల్: విమానం గాలిలో ఎగురుతుండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఇండిగో (IndiGo) పైలట్లు సానుకూలంగా స్పందించారు. ప్రయాణికుడికి మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆ విమానాన్ని ఇండోర్‌కు మళ్లించారు. శుక్రవారం ఇండిగోకు చెందిన 6ఈ-178 విమానం పాట్నా నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరింది. అయితే విమానం గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. విమాన సిబ్బంది తక్షణ వైద్య సహాయం అందించారు.
కాగా, మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న ప్రయాణికుడి శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తూ విమాన కెప్టెన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ విమానాన్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు మళ్లించారు. విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే ఆ ప్రయాణికుడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా, ఫ్లైట్ 6ఈ-178ను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు మళ్లించాం’ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ పైలట్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు.
IndiGo flight 6E-178 operating from Patna to Ahmedabad, was diverted to Indore due to a medical emergency on board. The crew assisted the unwell passenger. Prioritising his well-being, the captain diverted the flight en route. On arrival, the passenger was referred for further… pic.twitter.com/u4Z5ho9yoK
— ANI (@ANI) March 29, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

