ఖేడా: గుజరాత్లో బిపర్జాయ్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా గుజరాత్‌పై పడింది. దాంతో ఆ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉన్నది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
ఖేడా జిల్లాలోని నడియాడ్ ఏరియాలో వర్షం కారణంగా ప్రధాన రహదారిలోని అండర్‌పాస్‌లో భారీగా వరదనీరు నిలిచిపోయింది. దాంతో ఓ కాలేజీ బస్సు ఆ నీళ్లలో ఆగిపోయింది. విద్యార్థినిలు బస్సు నుంచి కిందకు దిగే అవకాశం లేకుండా పోయింది. దాంతో స్థానికులు స్పందించి.. బస్సులో ఇరుక్కున్న ఒక్కొక్క విద్యార్థినిని కిటికీల్లోంచి బయటికి లాగారు.
#WATCH | Gujarat: Due to heavy rain in Nadiad area of Kheda district, leading to waterlogging, a college bus got stuck in a bypass. The locals immediately rushed to the spot and rescued all the students on the bus. pic.twitter.com/D61cs00Hu7
— ANI (@ANI) June 24, 2023