Emirates flight | దుబాయ్ (Dubai)కి వెళ్లే ఎమిరేట్స్ విమానానికి (Emirates flight) పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి చెన్నై ఎయిర్పోర్ట్ (Chennai airport) నుంచి టేకాఫ్‌కు ముందు విమానం వెనుక భాగంలో భారీగా పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది పొగలను అదుపులోకి తెచ్చారు.
ఎమిరేట్స్ EK547 విమానం మంగళవారం రాత్రి 9:40 గంటల సమయంలో దుబాయ్ వెళ్లేందుకు చెన్నైలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్‌వేపై సిద్ధంగా ఉంది. టేకాఫ్‌కు ముందు గ్రౌండ్ స్టాఫ్ విమానంలో ఇంధనం నింపారు. అనంతరం పైలట్ విమానం ఇంజిన్‌ను ఆన్ చేయగానే.. విమానం వెనుక భాగం నుంచి భారీ ఎత్తున పొగలు (smoke comes out of plane) వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ ఇంజిన్ ఆఫ్ చేసి.. అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ ఫైటర్స్, ఇంజినీరింగ్ సిబ్బంది పరిస్థితిని క్షణాల్లోనే అదుపులోకి తెచ్చారు. ఆ సమయంలో విమానంలో 320 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో విమానం నాలుగు గంటలు ఆలస్యంగా అర్ధరాత్రి 1 గంటకు చెన్నై ఎయిర్‌ఫోర్ట్ నుంచి దుబాయ్ బయల్దేరి వెళ్లింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
✈️Smoke Scare Delays Dubai-Bound #Emirates Flight at Chennai Airport
Smoke detected from the tail during refueling at 9:40 PM Tuesday causing panic. Ground staff alerted pilots, who shut down engines to prevent escalation. Firefighters quickly responded bringing situation under… pic.twitter.com/N3IczuBvXR
— Nabila Jamal (@nabilajamal_) September 25, 2024
మరోవైపు తాజా ఘటనపై ఎమిరేట్స్ యాజమాన్యం స్పందించింది. చెన్నై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానం EK547 సాంకేతిక లోపం కారణంగా ఆలస్యం అయినట్లు వెల్లడించింది. తనిఖీల అనంతరం టేకాఫ్‌కు అనుమతి లభించినట్లు తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది.
Emirates spokesperson says, “Emirates flight EK547 from Chennai to Dubai on 24 September 2024 was delayed due to a technical fault. Following an engineering inspection, the aircraft was cleared to proceed to Dubai. Emirates apologises for the inconvenience caused. The safety of… pic.twitter.com/eEcrk9hVEJ
— ANI (@ANI) September 25, 2024
Also Read..
Kamala Harris | కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై కాల్పులు.. ఆందోళన కలిగిస్తున్న వరుస దాడి ఘటనలు
Jr NTR | డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడుదాం.. యువతకు ఎన్టీఆర్ పిలుపు
Mohan Babu | మోహన్ బాబు ఇంట్లో చోరీ.. రూ.10 లక్షలతో ఉడాయించిన పనిమనిషి