అబుధాబి, సెప్టెంబర్ 22: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా నీటిపై తేలియాడే మసీదును నిర్మించాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. ఆధ్యాత్మిక టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు మొదటిసారిగా దుబాయ్ వాటర్ కెనాల్లో వచ్చే ఏడాది నీటిపై తేలియాడే మసీదును ప్రారంభించాలని నిర్ణయించింది. సుమారు 55 మిలియన్ ధీరమ్లు (సుమారు 124 కోట్ల రూపాయలు) వ్యయంతో నిర్మించే ఈ మసీదులో మూడు అంతస్తులు ఉంటాయి.