న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఏకకాలంలో రెండు భిన్న కోర్సులు అభ్యసించేందుకు అవకాశం ఏర్పడింది. కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన విద్యావిధానం ప్రకారం విద్యార్థులు ఏక కాలంలో రెగ్యులర్ విధానంలో ఒక కోర్సు, దూర విద్యా విధానంలో మరో కోర్సు చేయవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ఎం జగదీశ్ కుమార్ తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ తప్పనిసరి అని పేర్కొన్నారు. 45 సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు కొన్ని రాష్ర్టాల వర్సిటీలు, ప్రైవేటు వర్సిటీల్లో కలిపి మొత్తం 60 వర్సిటీల్లో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ద్వారానే ప్రవేశాలు నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.