ముంబై: మద్యం సేవించిన ట్రాలీ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడు. రాంగ్ రూట్లో ట్రాలీని నడిపిన అతడ్ని జనం అడ్డుకున్నారు. అయితే తప్పించుకునేందుకు పలుమార్లు ట్రాలీని రివర్స్‌లో నడిపాడు. సుమారు 50 వాహనాలపైకి దూసుకెళ్లాడు. (Truck Driver Rams Vehicles) ఆగ్రహించిన జనం ఆ డ్రైవర్‌పై రాళ్లు విసిరారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లో ఈ సంఘటన జరిగింది. గురువారం డోంబివాలి-బద్లాపూర్ పైప్‌లైన్ రోడ్డులో రాంగ్ రూట్లో నడిపిన ట్రాలీ లారీ వచ్చింది. దీంతో ఎదురుగా వచ్చిన పలు వాహనాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు ఆ ట్రాలీని చుట్టుముట్టి డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, మద్యం సేవించిన ఆ డ్రైవర్ ట్రాలీ లారీతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వాహనాన్ని పలుమార్లు వెనక్కి ముందుకు నడిపాడు. ఖాళీ ప్రాంతంలో ఆగి ఉన్న వాహనాల నుంచి ముందుకు దూసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో పోలీస్ వాహనంతోపాటు పలు కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు దెబ్బతిన్నాయి. ఆగ్రహించిన జనం ఆ డ్రైవర్ పైకి రాళ్లు విసిరారు. ట్రాలీని అడ్డుకుని ఆపేందుకు ప్రయత్నించారు.
మరోవైపు ఆనంద్ నగర్‌లోని ఎంఐడీసీ ప్రాంతంలో డివైడర్‌ను ఢీకొట్టిన తర్వాత ఆ ట్రాలీ డ్రైవర్‌ను చివరకు పట్టుకున్నారు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मद्यधुंद ट्रेलर चालकाने उलट दिशेने ट्रेलर चालवत पोलिसांच्या गाडीसह किमान ५० वाहनांना धडक दिल्याची खळबळजनक घटना अंबरनाथजवळ घडली आहे. या ट्रेलर चालकाला पोलीस आणि रिक्षाचालकांनी पाठलाग करत पकडले आहे. काटई अंबरनाथ राज्यमार्गावर गुरुवारी दुपारी ही घटना घडली. pic.twitter.com/2Q0vyMPwHl
— LoksattaLive (@LoksattaLive) January 23, 2025