జైపూర్: ఒక వ్యక్తి మద్యం మత్తులో కన్న తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (Son Rapes Mother) బాధిత మహిళ తన చిన్న కుమారుడు, కుమార్తెతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడైన ఆమె పెద్ద కుమారుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్లోని బుండి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 6న 52 ఏళ్ల మహిళ 28 ఏళ్ల పెద్ద కొడుకుతో కలిసి సోదరుడి ఇంటికి వెళ్లింది. వారి గ్రామానికి తిరిగి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న కుమారుడు నిర్మానుష్య ప్రాంతంలో తల్లిపై అత్యాచారం చేశాడు.
కాగా, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బాధిత మహిళ తన చిన్న కొడుకు, కుమార్తెతో కలిసి దాబీ పోలీస్ స్టేషన్కు చేరుకున్నది. పెద్ద కుమారుడు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మహిళ పెద్ద కొడుకును అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. దీంతో కోర్టులో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు వెల్లడించారు.