తిరువనంతపురం: ఒక వ్యక్తి మద్యం మత్తులో కారును రైలు పట్టాలపై నడిపాడు (Man Drives Car Onto Railway Track). కొంతదూరం వెళ్లిన ఆ కారు రైలు పట్టాలపై ఆగిపోయింది. గమనించిన రైల్వే గేట్ కీపర్ వెంటనే రైల్వే స్టేషన్ సిబ్బందిని, పోలీసులను అలెర్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 18న ఒక వ్యక్తి మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఉన్న అతడు రాత్రి వేళ కారు డ్రైవ్ చేశాడు. కన్నూర్ నగరంలోని రైల్వే గేటు వద్ద రైల్వే ట్రాక్‌ను రోడ్డు మలుపుగా పొరపాటుపడ్డాడు. రైలు పట్టాల మీదుగా కారును నడిపాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత ఆ కారు ఆగిపోయింది.
కాగా, రైల్వే ట్రాక్‌పై కారు ఆగి ఉండటాన్ని రైల్వే గేటు కీపర్ గమనించాడు. వెంటనే కన్నూర్ రైల్వే స్టేషన్‌కు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రైలు పట్టాలపై కారు నడిపిన వ్యక్తిని 49 ఏళ్ల జయప్రకాష్‌గా గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న అతడు రోడ్డుగా పొరబడి రైల్వే ట్రాక్ మీదుగా కారు డ్రైవ్ చేసినట్లు తెలుసుకున్నారు. రైలు పట్టాలపై నిలిచిన ఉన్న కారును అక్కడి నుంచి తొలగించారు. అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ సమయంలో రైలు పట్టాలపై ఏ రైలు రాకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరుగలేదు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
താഴെചൊവ്വയിൽ കാർ റെയിൽവേ ട്രാക്കിൽ കയറി pic.twitter.com/oQi9W9L6Xn
— Ramith :: My :: india.🇮🇳🇮🇳 (@Ramith18) July 20, 2023