న్యూఢిల్లీ: కోచ్ అటెండెంట్స్, టీటీఈ కలిసి రైలు ప్రయాణికుడ్ని దారుణంగా కొట్టారు. కోచ్ అటెండెంట్ అతడ్ని బెల్ట్‌తో బాదాడు. ఆ తర్వాత వారంతా కలిసి కిందపడిన ప్రయాణికుడి మీదకు ఎక్కి కాళ్లతో తొక్కి తన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు రైల్వే ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అమృత్సర్-కతిహార్ ఎక్స్‌ప్రెస్ (Amritsar-Katihar Express) ట్రైన్లో ఈ సంఘటన జరిగింది. కదులుతున్న రైలులో ప్రయాణికుడు షేక్ తాజుద్దీన్‌తో కలిసి టీటీఈ రాజేష్ కుమార్, కోచ్ అటెండెంట్ విక్రమ్ చౌహాన్ మద్యం సేవించారు.
కాగా, మద్యం మత్తులో టీటీఈపై దాడికి ప్రయాణికుడు షేక్ తాజుద్దీన్ ప్రయత్నించాడు. దీంతో కోచ్ అటెండెంట్ విక్రమ్ చౌహాన్ రెచ్చిపోయాడు. బెల్ట్‌తో అతడ్ని చితకబాదాడు. మరో కోచ్ అటెండెంట్ సోను మహతో కూడా అక్కడకు చేరుకున్నాడు. వారంతా కలిసి తాజుద్దీన్ మీదకు ఎక్కి కాళ్లతో తన్నారు.
మరోవైపు రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో జరిగిన ఈ సంఘటనను కొందరు ప్రయాణికులు మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. రైల్వేకు ట్యాగ్ చేయడంతోపాటు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు స్పందించారు. మద్యం సేవించిన ప్రయాణికుడు షేక్ తాజుద్దీన్‌ను స్టేషన్లో రైలు నుంచి దించివేశారు.
కాగా, డ్యూటీలో మద్యం సేవించిన టీటీఈని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కోచ్ అటెండర్లు పరారయ్యారు. ఈ ముగ్గురు రైల్వే సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే కూడా ఈ సంఘటనపై స్పందించింది. ఆ ముగ్గురు రైల్వే ఉద్యోగులను సస్పెండ్ చేసింది.
ये रेलवे कर्मचारी हैं या रेलवे के गुंडे ?
काले कोट वाला गुंडा टीटीई यात्री की गर्दन पर पैर रखे हुए है, सफेद कपड़े में दूसरा कर्मचारी उल्टा करके उसपर बेल्ट से मार रहा है और गंदी-गंदी गालियाँ दे रहे हैं
वाह रील मंत्री जी…इन गुंडों पर कुछ कहेंगे ? pic.twitter.com/ud35BEPMIC
— Nigar Parveen (@NigarNawab) January 9, 2025