హర్సిల్: ఉత్తరాఖండ్‌లోని ధారాలీ గ్రామాన్ని(Dharali Village).. ఖీర్ గంగా నది ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ గ్రామం బురద, రాళ్లతో నిండిపోయింది. ఆకస్మిక వరదలు ఆ గ్రామాన్ని నేలమట్టం చేసింది. ఆ ఊరికి చెందిన డ్రోన్ దృశ్యాలను రిలీజ్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ స్థాయిలో విస్తరించుకుపోయిన బురద, రాళ్లను అవసరమైన చోటు తొలిగిస్తున్నారు. నది నీరు ప్రవహిస్తున్న కొన్ని ప్రదేశాల్లో తాత్కాలిక బ్రిడ్జీలు ఏర్పాటు చేశారు. ధారాలీ ఇప్పుడు నిర్జన ప్రదేశంగా మారింది. జలవిలయం కొన్ని హోటళ్లు కొట్టుకుపోవడంతో టూరిస్టులను తరలిస్తున్నారు. క్లౌడ్‌బస్ట్, కొండచరియల వల్ల .. అనేక మంది గల్లంతు అయ్యారు. అయితే ఇప్పటి వరకు 70 మందిని రెస్క్యూ చేశారు. 50 మంది మిస్సింగ్‌లో ఉన్నారు. అత్యాధునిక పరికరాల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
#WATCH | Uttarkashi, Uttarakhand | Drone visuals of the flash-flood affected Dharali village. SDRF, NDRF, and ITBP personnel are on the ground, rescuing the stranded people. pic.twitter.com/ueHw3TpTZx
— ANI (@ANI) August 7, 2025
ఉత్తరకాశీ, ధారాలీ మధ్య ఉన్న గంగోత్రీ హైవేపై పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి. శరవేగంగా ఆ పనులు సాగుతున్నాయి. పాపర్గాడ్, భట్వారి మధ్య క్లౌడ్‌బస్ట్ వల్ల రోడ్డు కొట్టుకుపోయింది. గంగనాని వద్ద కూడా బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. అక్కడ కూడా పునరుద్దరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కోసం భారతీయ వైమానిక దళం.. చినూక్ హెవీలిఫ్ట్ చాపర్లను వాడుతున్నది. జలవిలయం వల్ల భారీ నష్టం జరిగినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామీ తెలిపారు. క్లౌడ్‌బస్ట్, భారీ వర్షం వల్ల నష్టం తీవ్రంగా ఉన్నట్లు చెప్పారు. కొండచరియలు విరిగిపడడం వల్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమైందన్నారు. ఘటన జరిగిన రోజే 190 మందిని రక్షించామని, ప్రస్తుతం 274 మందిని కాపాడినట్లు తెలిపారు.
ఐటీబీపీ అసిస్టెంట్ కమాండెంట్ సురేశ్ యాదవ్ మాట్లాడుతూ.. ఆరంభంలో గంగోత్రీ వైపు ఉన్న వారిని రక్షించామని, గ్రామానికి చెందిన 8 మంది మిస్సింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. బీహార్, నేపాల్‌కు చెందిన 40 మంది ఆచూకీలేరన్నారు. గంగోత్రీలో నిలిచిపోయిన 300 మందిని రెస్క్యూ చేసినట్లు చెప్పారు. ఇండియన్ ఆర్మీ ఇంజినీర్ రెజిమెంట్ కెప్టెన్ గురుప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. శిథిలాల కింద చిక్కుకున్న బాడీలను గుర్తించేందుకు మెషీన్లు తీసుకురానున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు అయిదు మృతదేహాలను గుర్తించామని, రెస్క్యూ ఆపరేషన్‌లో 300 మంది ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. బీఆర్వోకు చెందిన అమిత్ కుమార్ మాట్లాడుతూ.. తమకు చెందిన నాలుగు మెషీన్లు ప్రస్తుతం ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు చెప్పారు. ఇంకా 40 ఇండ్ల వరకు శిథిలాల్లో ఉన్నాయని, అవి పూర్తిగా డ్యామేజ్ అయ్యాయని, 175 మందిని బీఆర్వో రెస్క్యూ చేసిందన్నారు.