ఆగ్రా: చారిత్రక కట్టడం ‘తాజ్‌మహల్’ వద్ద హైటెక్ భద్రతను మరింత పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గగనతల దాడుల్ని నిర్వీర్యం చేసేందుకు డ్రోన్ రక్షణ వ్యవస్థను తాజ్‌మహల్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేయబోతున్నట్టు ఏసీపీ సయ్యద్ అరీబ్ అహ్మద్ ఆదివారం మీడియాకు వెల్లడించారు.
‘దీని పరిధి 7 నుంచి 8 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ప్రధానంగా తాజ్‌మహల్ గోపురం నుంచి 200 మీటర్ల పరిధిలోకి ప్రవేశించిన డ్రోన్‌ను కుప్పకూల్చుతుంది’ అని అహ్మద్ చెప్పారు.