జమ్ముకశ్మీర్‌లో మళ్లీ డ్రోన్ కలకలం..
డ్రోన్ కలకలం| జమ్ముకశ్మీర్‌లో మరోమారు డ్రోన్ల కలకలం చెలరేగింది. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన చిన్నపాటి హెలికాప్టర్ (డ్రోన్) సరిహద్దులు దాటడానికి ప్రయత్నించింది. ఆర్నియా సెక్టార్లో పాక్‌కు చెందిన చిన్నపాటి హెలికాప్టర్‌ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గుర్తించింది.

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోమారు డ్రోన్ల కలకలం చెలరేగింది. శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన చిన్నపాటి హెలికాప్టర్ (డ్రోన్) సరిహద్దులు దాటడానికి ప్రయత్నించింది. గుర్తించిన బీఎస్ఎఫ్ సైనికులు దానిపై కాల్పులు జరిపారు. వెంటనే అది అటు నుంచి వెనక్కి మళ్లిందని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. డ్రోన్ ద్వారా రెక్కీ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
జమ్మూలోని భారత వైమానిక కేంద్రంపై గత ఆదివారం డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున వైమానిక కేంద్రంలో పేలుళ్లు జరిగాయి. ఈ డ్రోన్ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ కేసును ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారిస్తున్నది. 24 గంటలు గడవకముందే అంటే.. ఆదివారం రాత్రి 11.45 గంటలకు రత్నచక్, కాలూచక్ సైనిక ప్రాంతంలో ఒక డ్రోన్, అర్ధరాత్రి 2.40 గంటలకు ఇంకో డ్రోన్ తిరిగాయి. వీటి కదలికలను గుర్తించిన సైన్యం 25 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అవి తప్పించుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
విశ్వాన్ని చదివేందుకు..ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోపు
గాలిలో.. షికారుకెళ్లిన..
మోదీకి మామిడి పండ్లు పంపిన మమత
మా జోలికొస్తే తల పగులుతుంది
ప్రతి దేశంలో పదిశాతం మందికైనా టీకా
ఇక రాత్రి 10.45 వరకు మెట్రో పరుగులు
పీహెచ్‌డీకి కామన్ అడ్మిషన్ టెస్ట్
ఏ కాలేజీలోనైనా క్లాస్ వినొచ్చు!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

