హైదరాబాద్, అక్టోబర్ 7: ఆల్ ఇండియా బ్రాహ్మిణ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా తెలుగువాడైన ద్రోణంరాజు రవికుమార్ ఎన్నికయ్యారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో జరిగిన సంఘం జాతీయ స్థాయి కమిటీ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎస్డీ శర్మ (రాజస్థాన్) ఎన్నిక కాగా, ప్రధాన సలహాదారుగా పెద్దిభొట్ల లక్ష్మీనారాయణ, కార్యదర్శిగా శర్మ, యువజన విభాగానికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సూరంపూడి కామేష్‌లు ఎన్నికయ్యారు. కేసీ దవే, పంకజ్ మిశ్రా పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికల్లో ఏపీ నుంచి మల్లాది శ్రీనివాస్, చెరుకుచర్ల రఘురామయ్య, సుసర్ల ఉదయ్‌కుమార్, జగన్ మోహన్ శర్మ, మునిపలి శ్రీనివాస్, వాణి, వనమా కృష్ణవేణి, కులకర్ణి తదితరులు హాజరయ్యారు. ఒక తెలుగు వ్యక్తి స్థాపించిన ఈ సంఘానికి ఎన్నో ఏండ్లుగా కోట శంకరశర్మ ప్రాతినిధ్యం వహించారు.