సుక్మా: చత్తీస్ఘడ్(Chhattisgarh)లోని సుక్మాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇవాళ పది మంది నక్సల్స్ హతం అయ్యారు. బెజ్జి పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగినట్లు బస్తర్ రేంజ్ ఐజీ పీ సుందర్రాజ్ తెలిపారు. అయితే నక్సలైట్లను మట్టుపెట్టిన తర్వాత డిస్ట్రిక్ రిజర్వ్ గార్డులు సంబరాలు చేసుకున్నారు. నక్సల్స్ను హతమార్చిన ఆనందంలో చిందేశారు. గన్నులు పట్టుకుని .. గుంపులుగా డ్యాన్స్ చేశారు. గిరిజన తెగల స్టయిల్లో నృత్యం చేశారు.
కొరాజ్గూడ, దంతేస్పురం, నాగారం, బందార్పదార్ గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో కొంటా, కిస్టారం ఏరియా కమిటీ నక్సల్స్ సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో.. ఇవాళ ఉదయం ప్రత్యేక దళాలు ఆపరేషన్ చేపట్టాయి. ఆ ప్రాంతం నుంచి 10 మంది నక్సలైట్ల మృతదేహాలను రికవరీ చేసినట్లు ఐసీ సుందర్రాజ్ తెలిపారు. నక్సల్స్ నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇన్సాస్ రైఫిళ్లు, ఏకే-47, ఎస్ఎల్ఆర్ గన్లను కూడా సీజ్ చేశారు.
జిల్లా రిజర్వ్ గార్డులతో పాటు సీఆర్పీఎఫ్ దళాలు కూడా కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి.
#WATCH | DRG (District Reserve Guards) Jawans celebrate after succeeding in eliminating 10 Naxals during an encounter in Sukma, Chhattisgarh pic.twitter.com/dS3oYtzvZl
— ANI (@ANI) November 22, 2024