ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఫుడ్ డెలివరీ బాయ్స్ దుస్తుల్లో ఇద్దరు దొంగతనం చేశారు. సిటీలో ఉన్న జ్యువెలరీ షాపు(Jewellery Store)లోకి చొరబడ్డారు. గురువారం సాయంత్రం 3.30 నిమిషాలకు ఈ చోరీ జరిగింది. ఫుడ్ డెలివరీ ఏజెంట్ల తరహాలో ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు ఆ తర్వాత చోరీకి పాల్పడ్డారు. నిందితులు ఇద్దరు హెల్మెట్లు ధరించారు. బ్లింకిట్, స్విగ్గీ దుస్తులు వేసుకుని వచ్చారు. మన్షి జ్యువెలరీ షాపులోకి చొరబడ్డ ఆ ఇద్దరు అక్కడ ఉన్న ఉద్యోగిని నెట్టివేసి సిల్వర్ ఐటమ్స్ ఎత్తుకెళ్లారు.
డిస్ప్లే కేసుల్లో ఉన్న ఆభరణాలను తీసి తమ బ్యాగుల్లో కుక్కేశారు. షాపులో ఉన్న కుర్చీ తీసి అద్దాల కేజ్‌లను పగులగొట్టి వాటిల్లో ఉన్న ఐటమ్స్ దోచేశారు. టూ వీలర్ బైక్‌పై ఆ ఇద్దరూ పరారీ అయ్యారు. దొంగలు 20కిలోల సిల్వర్, 125 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. కేవలం అయిదారు నిమిషాల్లోనే ఈ తతంగం పూర్తి చేశారు. చోరీ మొత్తం సీసీటీవీ కెమెరాలకు చిక్కింది.
నేను వాష్‌రూమ్‌లో ఉన్నానని, దొంగ.. దొంగ అని మా ఉద్యోగి అరిచాడని, పోలీసులకు ఫోన్ చేసినట్లు ఆ షాపు ఓనర్ తెలిపాడు. పోలీసులు 15 నిమిషాల్లో అక్కడకు చేరుకున్నారని, దొంగతనం కేసులో విచారణ మొదలుపెట్టినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు.
That’s why people have trust issues.
Thieves disguised as delivery boys execute a robbery at a jewellery store in Ghaziabad.
— Neetu Khandelwal (@T_Investor_) July 25, 2025