న్యూఢిల్లీ : ఆకాశ్ ప్రైమ్ మిసైల్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, దీనిని బుధవారం లద్దాఖ్‌లో పరీక్షించారు. 4,500 మీటర్ల ఎత్తులో పని చేసే విధంగా దీనిని రూపొందించారు. రెండు అత్యంత వేగవంతమైన గగనతల లక్ష్యాలను ఆకాశ్ ప్రైమ్ విజయవంతంగా ధ్వంసం చేసింది.
ఆకాశ్ వెపన్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేసి ఆకాశ్ ప్రైమ్‌గా అభివృద్ది చేశారు. షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ పృథ్వి-2. అగ్ని-1లను భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది.