న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన ‘ప్రళయ్’ క్షిపణికి సంబంధించి ప్రయోగ పరీక్షలు సక్సెస్ అయ్యాయి. బుధవారం ఒడిశా తీరంలో ఒకే లాంచర్ నుంచి రెండు క్షిపణులను, వాటి సామర్థ్యాలను విజయవంతంగా పరీక్షించారు. ‘ప్రళయ్’ అనేది డీఆర్డీవో అభివృద్ధి చేసిన అత్యాధునిక, వ్యూహాత్మక బాలిస్టిక్ మిస్సైల్.
ధ్వని వేగం కంటే ఐదు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. అంతేగాక తక్కువ ఎత్తులో ప్రయాణించి, శత్రువుల రాడార్లను తప్పించుకోగలదు. అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థను కలిగివుంది. ఏకకాలంలో పలు లక్ష్యాలను చేధించేందుకు వివిధ రకాల వార్‌హెడ్స్‌ను మోసుకెళ్లటం దీని ప్రత్యేకత.