కైలాస్ మానస సరోవర యాత్ర ఈసారి కూడా డౌటే? ఎందుకంటే
ఈసారి కూడా కైలాస్ మానస సరోవర్ యాత్ర ఉండకపోవచ్చు. కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఈ యాత్రను రద్దు చేశారు. ఈ సారి కూడా ఈ యాత్ర కాస్త అనిశ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ యాత్రకు సంబంధించిన నోడల్ ఏజెన్సీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు ఇప్పటి వరకూ అందలేదు. మూములుగా అయితే.. ఈ యాత్ర ప్రారంభానికి కొద్ది రోజుల ముందు కేంద్ర విదేశాంగ శాఖ కుమాన్ మండల్ వికాస్ నిగమ్ (యాత్రకు సంబంధించిన నోడల్ ఏజెన్సీ), పిటోడాగఢ్ జిల్లా యంత్రాంగంతో ఓ పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఈ యాత్ర పై చర్చిస్తుంది. ఈ సారి మాత్రం ఇలాంటి సమావేశం ఇప్పటి వరకైతే జరగలేదు. దేశ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో ఈ సారికైలాస్ మానస సరోవర్ యాత్ర ఉంటుందని అందరూ భావించారు.
మామూలుగా ఈ యాత్రకు సంబంధించిన సన్నాహక సమావేశం జనవరి నుంచి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన సూచనలను కేంద్ర విదేశాంగ శాఖ జారీ చేస్తుంది. కానీ… ఈ యేడాది ఇప్పటి వరకూ ఎలాంటి సూచనలు తమకు రాలేదని నోడల్ ఏజెన్సీ అధికారులు పేర్కొంటున్నారు. ఇక.. యాత్ర కోసం ఏర్పాట్లు చేయడానికి తమ దగ్గర సమయం కూడా అంతగా లేదని నోడల్ ఏజెన్సీ జనరల్ మేనేజర్ ఏపీ వాజ్పాయ్ అన్నారు. ఒకవేళ తమకు ఈ యాత్రకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు అందినా… ఇప్పుడు ఏర్పాట్లు చేయడం చాలా కష్టతరమైన పని అని ఆయన అంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

