న్యూఢిల్లీ : మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న 2 కోట్లకుపైగా ఫోన్ కనెక్షన్లను బ్లాక్ చేసినట్టు కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం (డీవోటీ) బుధవారం ప్రకటించింది. మోసపూరిత కాల్స్‌ను 97 శాతం తగ్గించగలిగామని డీవోటీ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ మీడియాకు తెలిపారు.
డీవోటీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టెలికం సేవల్ని దుర్వినియోగం చేస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడేవారి సంఖ్య పెరిగిందని అన్నారు. ‘మోసగాళ్లు తమ కాలర్ ఐడీని దాచిపెడుతూ మోసాలకు పాల్పడటమే ‘కాల్ స్ఫూఫింగ్’. వీటిని అడ్డుకునేందుకు ఆర్థిక సంస్థలకు సహాయపడే విధంగా డిజిటల్ ఇంటెలిజెన్స్ వేదికను డీవోటీ అభివృద్ధి చేసింది.