న్యూఢిల్లీ : మనం తరచూ ప్రకటనల్లో.. ‘మా ప్రొడక్ట్ వంద శాతం సురక్షితమైనది.. వంద శాతం స్వచ్ఛమైనది.. వంద శాతం ఉపశమనం కలిగిస్తుందది..’ లాంటి మాటలు వింటుంటాం. అయితే ఇక నుంచి 100 శాతం అన్న పదాన్ని వాడరాదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏ) అడ్వైజరీ గురువారం జారీ చేసింది.
ఫుడ్ లేబులింగ్లో 100% అనే పదాన్ని ఉపయోగించడం వల్ల వినియోగదారులను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ ఈ ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల ఆహార వ్యాపార నిర్వాహకులు ఈ పదాన్ని ఉపయోగించరాదని కోరింది.