రుణగ్రహీతలను బెదిరించొద్దు
- ఉదయం 8కి ముందు, రాత్రి 7 తర్వాత కాల్స్ చేయొద్దు
- రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ మరోసారి స్పష్టీకరణ
ముంబయి, ఆగస్టు 12: రుణాలను వసూలు చేసుకునేందుకు రుణగ్రహీతలపై బెదిరింపులకు పాల్పడరాదని, ఉదయం 8 గంటలకు ముందు, రాత్రి 7 దాటిన తర్వాత కాల్స్ చేసి వేధించరాదని లోన్ రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ మరోసారి స్పష్టంచేసింది. ఈ మేరకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఏఆర్సీలకు తాజాగా ఆదేశాలు జారీచేసింది. రుణ వసూలు విషయంలో రికవరీ ఏజెంట్లు తమ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆర్బీఐ పేర్కొన్నది. తమ ఆదేశాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు స్పష్టంచేసింది. రుణగ్రహీతలపై రికవరీ ఏజెంట్లు దూషణలకు దిగడం, అభ్యంతరకర సందేశాలు పంపడం, రాత్రివేళల్లో కాల్స్ చేయడం వంటి చర్యలకు దిగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఇప్పటికే వీటి అడ్డకట్టకు ఆదేశాలు జారీచేసింది. అయినప్పటకీ రికవరీ ఏజెంట్ల ఆగడాలు కొనసాగుతుండటంతో శుక్రవారం అదనపు నిబంధనలు జారీచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

