ముంబై, ఫిబ్రవరి 11: ఎన్నికల ప్రచారానికి పిల్లలను వాడుకోవద్దన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలను మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే ఉల్లంఘించారు. ఓ పాఠశాలను సందర్శించిన శివసేన ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యే సంతోష్ బంగార్ విద్యార్థులతో మాట్లాడుతూ ‘ఎన్నికల్లో ఓట్లన్నీ నాకే పడాలి.
ఇలా జరగాలంటే మీరంతా మీ తల్లిదండ్రులకు చెప్పాలి. సంతోష్ బంగార్కు ఓటు వేస్తేనే తిండి తింటామని, లేకుంటే తినమని కండీషన్ పెట్టాలి. అయినా ఓటు వేయకుంటే రెండు రోజులు తినడం మానేయాలి’ అని సూచించారు. సంతోష్ వ్యాఖ్యలను విపక్షాలు ఖండించాయి.