శ్రీనగర్ : కశ్మీరీలపై ఉగ్రవాద ముద్ర వేయవద్దని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరారు. ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద ఈ నెల 10న జరిగిన పేలుడును ఆయన ఖండించారు. ప్రజలు శాంతి, సోదరభావాలను పాటించాలని పిలుపునిచ్చారు. అమాయకులను అత్యంత క్రూరంగా చంపడాన్ని ఏ మతమూ సమర్థించదన్నారు.
కశ్మీర్లో అందరూ ఉగ్రవాదులు కాదని, ప్రతి ఒక్కరూ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నవారు కాదని తెలిపారు. అందరినీ ఒకే గాటన కట్టి, ఉగ్రవాదులుగా ముద్ర వేయడం సమంజసం కాదన్నారు. టెర్రరిస్ట్ అనే ముద్ర వేయడం వల్ల ప్రజలను సరైన దారిలో నడిపించడం మరింత కష్టమవుతుందని చెప్పారు.