నూరేండ్లు నిండిన పార్టీలో
మహాత్ముడు మాయమై
హిట్లర్ పుట్టుకొచ్చాడు!
ప్రపంచ ద్వేషితుడు
ఆశ్చర్యంగా మనకిప్పుడు ఆదర్శమట
ప్రజాస్వామ్యం ఇకపై మేడిపండు!
అహింసా పునాదుల్లో
‘అ’సమాధి అయింది
హింసా ప్రస్థానం మొదలైంది!
రాజ్యాంగం ఇప్పుడు
‘హస్త’భూషణమే
ఎదురొస్తే తొక్కేయడమే!
కొత్త కొత్త అనుభవాలు
పాఠాలు నేర్పుతుంటే
జనం కలిసొచ్చే
కాలం కోసం ఎదురుచూపు!
రాజనీతికి తావు లేని చోట
కుప్పకూలే రోజొచ్చేదాకా
రాజకీయాలే ఊరేగుతాయి!
నేరాలు లెక్కిస్తూ దూరంగా
మౌనమొకటి నిరీక్షిస్తున్నది
శిశుపాలుని ఆఖరి తప్పు కోసం!!